ఊపందుకున్న ఎల్లో ప్ర‌చారం? నీతులు ఇప్పుడు చెబుతున్నారే..!

-

అవును! రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్ర‌మే అప్పులు చేస్తోంద‌ని, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మారుస్తోం ద నే ఓ ఎల్లో ప్ర‌చారం ఊపందుకుంది. అయిన దానికీ కానిదానికీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అప్పులు చేస్తోంద‌ని, దీనిని ఇలా చేసుకుంటూ పోతే.. రాష్ట్రం అప్పుల పాల‌వుతుంద‌ని, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై టీడీపీ అనుకూల మీడియా దుమ్మెత్తి పోయ‌డం ప్రారంభించింది. మ‌రి ఇప్పుడు గొంతు చించుకుని క‌లాన్ని విరుగ్గొట్టుకుని మ‌రీ రాస్తు న్న ఈ మీడియా.. చంద్ర‌బాబు హ‌యాంలో చేసిన అప్పుల విష‌యంపై అప్ప‌ట్లోనూ ఇలానే వ్య‌వ‌హ‌రించిం దా? అప్ప‌ట్లోనూ ఇలానే రాసుకొచ్చిందా? అంటే.. ప్ర‌శ్న‌లు త‌ప్ప స‌మాధానాలు క‌నిపించ‌వు.

అప్ప‌ట్లో చంద్ర‌బాబు చేసిన అప్పుల‌కు బోలెడు స‌మ‌ర్ధ‌న‌లు చోటు చేసుకున్నాయి. రాష్ట్రాన్ని అనైతికంగా విభ‌జించార‌ని, లోటుబ‌డ్జెట్‌లో ఉన్న‌ద‌ని.. అందుకు అప్పులు చేయ‌క త‌ప్ప‌ద‌ని, మ‌న ఇంట్లోనే ఏదైనా అ వ‌స‌రం అయితే. మ‌న‌మైనా అప్పుల‌కు వెళ్ల‌డం లేదా? అని స‌మ‌ర్ధ‌నాపూర్వ‌క వ్యాసాలు , వార్త‌లు పుంఖా ను పుంఖాలుగా వెలువ‌రించింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు గ‌ద్దె దిగేనాటికి ల‌క్ష‌ల కోట్ల అప్పులో ఏపీ ము నిగిపోయింది. దీనికి క‌ట్టాల్సిన వ‌డ్డీనే ఏటా 5 వేల కోట్లు! పోనీ .. ఈ అప్పులో ఏమైనా ప్ర‌జోప‌యోగ ప్రాజెక్టు ల‌కు బాబు ఖ‌ర్చు పెట్టారా?  అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు.

త‌న ప్ర‌చారానికి, మీడియా యాడ్ల‌కు విప‌రీతంగా ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు చేశార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇక‌, ధ‌ర్మ పోరాట దీక్ష‌ల పేరుతో కోట్ల‌కు కోట్ల బాబు త‌గ‌లేసిన విష‌యం ఈ మీడియా కంటికి క‌నిపించ‌లే దు. ఇలా ఉన్న ప‌రిస్థితిలో ఏపీ స‌ర్కారు అప్పులు తీసుకునేందుకు విదేశాల‌కు వెళ్తోంది.. అని ఎల్లో మీడియా ప్ర‌చారం చేస్తోంది. వాస్త‌వానికి ఒక వేళ అప్పులు చేసినా.. వాటిని ప్ర‌జోప‌యోగ కార్య‌క్ర‌మాల‌కే క‌దా ఖ‌ర్చు చేస్తార‌ని మీరు ఒప్పుకుంటున్న‌ది. మ‌రి ఇంకా ఏడుపు ఎందుకు? అప్పులు చేసి ధ‌ర్మ పోరాట దీక్ష‌లు లాంటివి.. మాయా మ‌హ‌ళ్ల‌ను డిజిటిల్ తెర‌ల‌పై సృష్టించేందుకు కాదు క‌దా!? ఇప్ప‌టికైనా క‌ళ్ల అద్దాలు మార్చుకుంటే బెట‌ర్‌.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news