రియ‌ల్‌మి కొత్త బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి భార‌త్‌లో రియ‌ల్‌మి సి11 పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెస‌ర్‌ను ఇందులో అమ‌ర్చారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారంగా ఈ ఫోన్ ప‌నిచేస్తుంది. వెనుక భాగంలో 13 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 5 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీని ఏర్పాటు చేశారు.

realme C11 smart phone launched in India

రియ‌ల్‌మి సి11 స్పెసిఫికేష‌న్లు…

* 6.52 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* గొరిల్లా గ్లాస్ 3 ప్ల‌స్ ప్రొటెక్ష‌న్‌, 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెస‌ర్
* 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10
* 13, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 10 వాట్ల చార్జింగ్

రియ‌ల్‌మి సి11 స్మార్ట్‌ఫోన్ రిచ్ గ్రీన్‌, రిచ్ గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా.. ఈ ఫోన్‌ను రూ.7,499 ధ‌ర‌కు ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 22వ తేదీ నుంచి విక్ర‌యించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news