వారాహి వాహనంలో జనసేన వినాయకుడు..వీడియో వైరల్

-

Janasena : మొన్న సోమవారం రోజున దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ నేపథ్యంలోనే భక్తులందరూ గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహించారు. ముంబై, గుజరాత్ మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున గణపతులు కొలువుదీరాయి. ఇక కొన్నిచోట్ల గణపతులను వివిధ ఆకారాలలో ఏర్పాటు చేశారు భక్తులు. కొందరైతే చంద్రయ్య గణపతిని కూడా ఏర్పాటు చేశారు.

ఈ తరుణంలోనే జనసేన పార్టీ కార్యకర్తలు అనూహ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజం లో ఓ వినాయకుడిని ఏర్పాటు చేశారు జనసేన కార్యకర్తలు. జనసేన ఎర్ర కండువా, తెల్ల చొక్కా వేసి గణపతిని ఏర్పాటు చేశారు. అలాగే ఈ విగ్రహాన్ని వారాహి వాహనం సెటప్ వేసి… అందులో పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

https://x.com/BheemlaBoy1/status/1703998573552210284?s=20

Read more RELATED
Recommended to you

Latest news