సండే స్పెషల్: గంటా.. రిస్క్ తీసుకోనంటున్నారంట.. ఎందుకంటేనంట…!

-

గంటా శ్రీనివాస్ వైకాపాలోకి వెళ్తున్నారు అనే మాట గత రెండు రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గంటా శ్రీనివాస్ అయినా మరెవరైనా.. టీడీపీ నుంచి వైకాపాకు వెళ్లడం, వస్తానని రిక్వస్ట్ లెటర్స్ పంపడం పెద్ద విషయం కాదు. కానీ… ఇక్కడ విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తికి ఇష్టం లేకుండా వెళ్లడం గురించే ఇది పెద్ద విషయం అయ్యింది!

వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం వంటి వారు ఇప్పటికే టీడీపీకి బాయ్ బాయ్ చెప్పేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెక్స్ట్ గంటా శ్రీను అని కథనాలు రావడానికి కొన్ని రోజుల ముందే.. విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో “గంటా సైకిల్ స్కాం” అంటూ మొదలుపెట్టేశారు! దీంతో గంటా శ్రీనివాస్ వైకాపాలోకి రావడం విషయం పక్కకుపోయి.. అచ్చెన్న, జేసీ ప్రభాకర్ రెడ్డి, కొల్లు రవీంద్ర ల అనంతరం ఏసీబీ అధికారులు “గంటా ఇంటి గంట” మోగించబోతున్నారని అంతా భావించారు!

ఈ సమయంలో సాయిరెడ్డి క్వారంటైన్ లో ఉండటం.. కేసులనుంచి తప్పించుకునే క్రమంలో వైకాపా పై గంటా శ్రీనివాస్ కొత్త ప్రేమ చూపించడం.. అందులో భాగంగా సజ్జల రామకృష్ణను ఆశ్రయించడం.. సాయిరెడ్డి స్థానాన్ని ఆక్రమించే క్రమంలోనో ఏమో కానీ.. సజ్జల కూడా వెనకా ముందూ ఆలోచించకుండా సరేననడం జరిగిపోయాయని అంటున్నారు!! సజ్జల ఆవేశంలో సరే అన్నా.. దాని వెనక చాలా తతంగమే నడవాలి. అన్నింటికంటే ముందు జగన్ ఒప్పుకోవాలి! ఈ సమయంలో జగన్ రాజకీయంగా ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు అనడానికి.. మంత్రి వర్గ విస్తరణే సాక్ష్యం!

ఈ క్రమంలో సాయిరెడ్డి ట్వీట్ల విషయం గుర్తుకువచ్చిందో లేక కేసుల విషయంలో జంకారో తెలియదు కానీ… వైకాపాలో చేరడంపై గంటా శ్రీనివాస్ పునరాలోచనలో పడ్డారని విశాఖ కేంద్రంగా గుసగుసలు వినిపిస్తున్నాయి! పైగా సాయిరెడ్డిలాంటి నేతను కాదని వైకాపాలో తాను చేయగలిగింది ఏమీ ఉండకపోవచ్చని, ఉత్సవ విగ్రహం పాత్ర మాత్రమే మిగలొచ్చని కూడా మరో ఆలోచన చేస్తున్నారంట.. గంటా!!

దీంతో… అవినీతి విషయంలో ఏమాత్రం నిజమున్నా జగన్ ఎలాగూ పార్టీలో చేర్చుకోరు కాబట్టి… ఇలాంటి పరిస్థితుల్లో అండగా ఉండటానికి “బీజేపీ” అనే పార్టీ హస్తిన కేంద్రంగా ఉందని గుర్తుకుతెచ్చుకున్నారంట! సుజనా చౌదరి, సీఎం రమేష్, మొదలైన నేతలకు నేడు అదే “సురక్షితమైన స్థలం”గా మారిన నేపథ్యంలో… తాను కూడా అటే పోతే పోలా అని అనుకుంటున్నారంట!!

Read more RELATED
Recommended to you

Latest news