క్రేజ్ అంటే ఇదీ : సూర్య సరికొత్త రికార్డ్ ఏంటో తెలుసా..!

-

జూలై 23న తన 45వ పుట్టిన రోజు సందర్భంగా హీరో సూర్య సోషల్ మీడియా‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్‌ అయ్యారు. తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యను 24 గంటల వ్యవధిలోనే 1.4 మిలియన్‌ మంది ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో తన మీద అపరిమితమైన ప్రేమను చూపిస్తున్న అభిమానులకు సూర్య కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి అభిమానులు ఉండటం నిజంగా తన అదృష్టం అని సూర్య అన్నారు. సరిగ్గా రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మూడు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

అందులో ఒకటి భార్య జ్యోతికతో ఉన్నది ఒకటైతే.. రెండోది తన ఫోటోను షేర్ చేసాడు. ప్రస్తుతం సూర్య ఇన్‌స్టాగ్రామ్‌లో నలుగురిని ఫాలో అవుతున్నాడు. అందులో ఆయన బ్రదర్ హీరో కార్తి కాగా.. రెండోది ఆయన సిస్టర్ బృందా, బెస్ట్ ఫ్రెండ్ రాజశేఖర్ పాండియన్, నాల్గోది తన ప్రొడక్షన్ హౌస్ 2 డీ ఎంటర్టైన్మెంట్‌ను ఫాలో అవుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news