అచ్చెన్నాయుడి స్థాయి పెంచిన గంటా… బాబు ఫీల్ కావొద్దు!

-

పార్టీలో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా… మిగిలిన నేతలంతా ఆ విషయంపై వారికున్న అవగాహన మేరకు, ఆ వ్యక్తిపై ఉన్న అభిమానం మేరకు స్పందిస్తుంటారు. ఉదయం అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తే… చంద్రబాబు, లోకేష్ లతోపాటు మిగిలిన టీడీపీ నేతలంతా మైకులముందుకు వచ్చారు. ఎవరిస్థాయిలో వారు ప్రభుత్వంపై ఆరోపణలు చేసేశారు. ఇది జగన్ రాజకీయ కక్షసాధింపుల్లో భాగమని తేల్చేశారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… అచ్చెన్నాయుడి విషయంలో గంటా శ్రీనివాస రావు కూడా స్పందించారు.

ఇక్కడ “కూడా” అనే పదం వాడటానికి పెద్ద కథే ఉంది. గతకొంతకాలంగా గంటా శ్రీనివస రావు చాలా సైలంటుగా ఉంటున్నారు. అధికారపక్షంపై విమర్శలూ లేవు, ప్రశంసలూ లేవు! ఇటు ప్రతిపక్షంపై అధికారపక్ష నేతలు, విశాఖ నేతలు విమర్శలు చేసినా కూడా స్పందించలేదు. చంద్రబాబుని ఆయన జిల్లాకే చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శలు చేసినప్పుడు కూడా “సమయం వచ్చినప్పుడు స్పందిస్తాను” అంటూ సైలంటయిపోయారు.

అంతెందుకు… నిన్న చంద్రన్న కానుక, ఏపీ ఫైబర్ గ్రిడ్స్ లో అవకతవకలు జరిగాయని, వాటిపై సీబీఐ విచారణకు ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కూడా గంటా ట్విట్టర్ లో స్పందించలేదు! చంద్రబాబు – లోకేష్ లను వెనకేసుకు రావడమో, జగన్ ను విమర్శించడమో కూడా చేయలేదు! దీంతో కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారు! అందరికీ మైకుల ముందుకు వచ్చే అవకాశం లేకపోయినా కనీసం ట్విట్టర్ లో అయినా స్పందించారు కానీ… గంటా సైలంట్ గా ఉన్నారు.

అలాంటి గంటా శ్రీను.. తాజాగా అచ్చెన్న వ్యవహారంపై స్పందించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంలో ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని.. కాస్త బరువైన పదాలతోనే ప్రారంభించిన గంటా… సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచి సరైన సమాధానం రాకుంటే అరెస్ట్ చేస్తారు. అలా ఏమీ నోటీస్ కూడా లేకుండా 100 మంది పోలీస్ బలగాలతో బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని ఎవరూ హర్షించరు. ప్రభుత్వ వైఖరి మార్చుకోకుంటే వీటన్నింటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంటూ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఫైరయ్యారు. దీంతో… అచ్చెన్నాయుడి స్థాయి పెంచిన గంటా… అచ్చెన్నపై గంటాకు.. చంద్రబాబుపై ఉన్న అభిమానం కంటే ఎక్కువే ఉన్నట్లుందే అని అంటూ ఆన్ లైన్ లో కామెంట్లు పడుతున్నాయి!

Read more RELATED
Recommended to you

Latest news