ఇక విజయవాడ నుంచే పాస్ పోర్ట్ ప్రాసెసింగ్ ఉండనుంది. దీనిపై విజయవాడ రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ శివ హర్ష మాట్లాడుతూ… విజయవాడ సెంట్రల్ కార్యాలయం నుండి పాస్ పోర్ట్ ప్రాసెసింగ్ ఉంటుందని… ఇక నుండి పాస్ పోర్ట్ ప్రింటింగ్ విజయవాడ కార్యాలయం నుంచి చేయడం సమయం వృధా అవ్వదని తెలిపారు. తిరుపతి పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని మెరుగైన సదుపాయాలతో రెన్యువేట్ చేయడం జరిగిందని… పాస్ పోర్ట్ సర్వీస్ మెరుగైనందుకు ఆనందంగా ఉందని చెప్పారు.
పాస్ పోర్ట్ కొరకు అప్లై చేసిన వారి కోసం రోడ్డు పై వేచి ఉన్న వారి కొరకు షెడ్డు ఏర్పాటు చేశామని… పాస్ పోర్ట్ సేవలకు సహకరించిన టాటా కన్సల్టెన్సీ సేవలను అభినందిస్తున్నానని తెలిపారు. కేవలం ఒక తిరుపతిలోనే 500 పాస్ పోర్ట్ లు ఇస్తున్నామని.. ఏజెంట్ ల వద్దకు వెళ్ళకుండా పాస్ పోర్ట్ అప్లై చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆన్లైన్ లో అప్లై చేసుకునే విధానం వచ్చినప్పటి నుండి పాస్ పోర్ట్ మేళా ప్రస్తుతం పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది….పాస్ పోర్ట్ ఇచ్చే సమయంలో ఒకటికి రెండు సార్లు వెరిఫై చేస్తామని చెప్పారు.