ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రతన్ టాటా ఇన్నోవోటేషన్ కింద అమరావతిలో హెడ్ క్వార్టర్, 5 జోన్లలో 5 ఇన్నోవేషన్ హబ్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు. అమరావతిలో ఇవాళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన కీలక భేటీలో ఆయన మాట్లాడారు. రతన్ టాటా స్ఫూర్తితోనే ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రతీ ఇంట్లో ఒక వ్యవస్థాపకులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతీ నియోజకవర్గంలో ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటు చేస్తామని.. అందులో రైతులను కూడా భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు చంద్రబాబు. జాబ్ ఫస్ట్ విధానంతో దేశంలోనే మొదటిసారిగా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేవారికి ప్రోత్సాహకాలు కూడా అందజేస్తామన్నారు. 10 శాతం అదనంగా ఉద్యోగాలు కల్పించే వారికి ప్రోత్సాహకం మరింత ఇస్తామని ప్రకటించేశారు. ఇండస్ట్రీయల్ పాలసీ, ఇండస్ట్రీయల్ పార్కు, గ్రీన్ ఎనర్జీ, 6 పాలసీలు తీసుకొచ్చామన్నారు. సూపర్ 6 హామీలలాగే సూపర్ 6 పాలసీలు తీసుకొచ్చామని తెలిపారు.