తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. వారికి నేరుగా శ్రీవారి దర్శనం..!

-

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వస్తుంటారు. ఇటీవల చోటు చేసుకున్న లడ్డూ ప్రసాదం వివాదం కారణమో.. లేక వర్షాలో ఏమో తెలియదు.కానీ తిరుమలకు భక్తుల రద్దీ మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా మంగళవారం శ్రీవారి దర్శనానికి చాలా తక్కువ మంది తరలి వచ్చారు.

మరోవైపు వారాంతపు సెలవులు కూడా ముగిసిపోవడంతో టోకెన్లు లేని భక్తులు, 300 ప్రత్యేక టోకెన్లు తీసుకున్న వారికి నేరుగా శ్రీవారి దర్శనం అవుతోంది. అదేవిధంగా బుధవారం వైకుంఠం, క్యూ కాంప్లెక్స్ కూడా ఖాలీగా దర్శనమిస్తోంది. స్వామి వారిని మంగళవారం 67,616 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 22,759 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీ వారి హుండి ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news