ప్రయాణికులకు అలర్ట్.. ఈ రైళ్లు బయలుదేరే సమయాల రీ షెడ్యూల్‌

-

ప్రయాణికులకు అలర్ట్. ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్‌తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించారు. ఈ విషయాన్ని వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సమయానికి సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని ఆయన సూచించారు. మరి సమయం మారి రైలు సర్వీసుల వివరాలు ఏంటంటే?

రీ షెడ్యూల్ అయిన రైళ్ల వివరాలు ఇవే..

భువనేశ్వర్‌ – చెన్నై సెంట్రల్‌ (12830) ఎక్స్‌ప్రెస్‌ ఆగస్టు 1న మధ్యాహ్నం 12.10 గంటలకు బదులు 1.10 గంటలకు బయల్దేరుతుంది. పూరీ – గాంధీధామ్‌ (22974) ఎక్స్‌ప్రెస్‌ ఆగస్టు 3వ తేదీ ఉదయం 11.15 గంటలకు బదులు మధ్యాహ్నం 12.45గంటలకు స్టార్ట్ అవ్వనుంది. ఇక భువనేశ్వర్‌ –   తిరుపతి (22879) ఎక్స్‌ప్రెస్‌ ఆగస్టు 3న మధ్యాహ్నం 12.10 గంటలకు బదులు 1.10 గంటలకు బయలు దేరేలా మార్పు చేసినట్లు సందీప్ వెల్లడించారు. విశాఖ – పలాస(07470) మెము ఈనెల 29, ఆగస్టు 1,3 తేదీల్లో శ్రీకాకుళం రోడ్‌ వరకే నడుస్తుందని.. మళ్లీ అక్కడి నుంచే విశాఖ వస్తుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news