ఆంధ్రప్రదేశ్ లోని వాలంటీర్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వాస్తవానికి వాలంటీర్స్ వ్యవస్థని మాజీ సీఎం జగన్ తీసుకొచ్చారు. ఆ సమయంలో వాలంటీర్స్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వార్తలు వినిపించాయి. ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది. వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు వ్యవహారిస్తున్నారని వాలంటీర్లను విధుల్లో లేకుండా ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల సమయంలో ఓవైపు వైసీపీ.. మరోవైపు కూటమి నేతలు వాలంటీర్లపై మాటల యుద్ధమే చేశారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా మంత్రిని ఏర్పాటు చేశారు. గ్రామ వాలంటీర్స్ మంత్రిగా డోల బాల వీరాంజనేయ స్వామిని నియమించారు చంద్రబాబు. ఈ శాఖతో పాటు సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖలు కూడా ఆయనకే అప్పగించారు.