Gorantla Butchaiah Chowdary Named Protem Speaker : ఇవాళ, రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఇవాళ ఉదయం 9.46 కు ప్రారంభం కానుంది శాసనసభ. సీఎం గానే సభలో అడుగు పెడతానన్న పంతం నెగ్గించుకున్న చంద్రబాబు… సుమారు రెండున్నర ఏళ్ల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. అటు మొదటిసారి అసెంబ్లీ గడప తొక్కుతున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/06/Gorantla-Butchaiah-Chaudhary-as-Protem-Speaker.jpg)
ప్రతిపక్ష హోదా లేకుండా సాధారణ ఎమ్మెల్యేలుగానే సభలో అడుగుపెట్టనున్నారు వైసీపీ సభ్యులు. ఇక ఈ సందర్భంగా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. స్పీకర్ ఎన్నికకు సభలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ప్రోటెం స్పీకర్. ముందుగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, మహిళా సభ్యులు, ఆ తర్వాత మిగిలిన సభ్యులు ప్రమాణం ఉంటుంది. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పోలమాలవేసి నివాళి అర్పించనున్నారు సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు.