2015 నుంచే ప్రపంచం యోగా ప్రాముఖ్యత గుర్తించింది : ప్రధాని మోదీ

-

యోగా ప్రతి ఒక్కరి జీవితంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేవలం భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపారు. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని అన్నారు. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని చెప్పారు. శ్రీనగర్‌లోని డాల్‌ సరస్సు సమీపాన నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో యోగాపై నేడు అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. యోగా ఇప్పుడొక దైనందిన కార్యక్రమమైంది. దీని ప్రాముఖ్యతను అనేక దేశాధినేతలు తనని అడిగి తెలుసుకున్నారు. అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. మరోవైపు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో కశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రఖ్యాత డాల్‌ సరస్సు ఒడ్డున దాదాపు ఏడు వేల మందితో కలసి ప్రధాని ఆసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ, భారీ వర్షం కారణంగా అప్పటికప్పుడు వేదికను షేర్‌-ఏ-కశ్మీర్‌ సమావేశ కేంద్రానికి మార్చారు.

Read more RELATED
Recommended to you

Latest news