ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌..కరెంట్‌ కోతలకు చెక్‌ పెట్టిన సర్కార్‌

-

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది జగన్‌ సర్కార్‌. కరెంట్‌ కోతలకు చెక్‌ పెట్టేందుకు సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరెంట్‌ కోతలు లేకుండా.. విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు వెనక్కి తగ్గబోమని చెప్పారు విద్యుత్ శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్. వినియోగదారుకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని… రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల కనెక్షన్లకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోందని ఈ సందర్భంగా విద్యుత్ శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ప్రకటన చేశారు.

ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం 7700 కోట్ల వ్యయం చేస్తోందని.. 9,700కోట్ల రూపాయల సబ్సిడీ కూడా విడుదల చేసిందన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా 4,లక్షల 36 వేల విద్యుత్ అంతరాయలు 2019 లో ఉన్నాయన్నారు. దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాలు ఏపీకి ఉన్నాయని.. కొరత ఉన్న సమయంలో బహిరంగ మార్కెట్ లో కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. సాయంత్రం వేళల్లో 7 రూపాయల వరకు యూనిట్ ధర పెరుగుతోందని.. సౌర విద్యుత్ ఉన్న కారణంగా పగటిపూట విద్యుత్ 2 రూపాయల కె మార్కెట్ లో దొరుకుతుందన్నారు.

అర్ధరాత్రి వెళల్లో మళ్ళీ 5 రూపాయల లోపులోనే యూనిట్ ధర కొనుగోలు చేయగలుగుతున్నామని.. ధర కారణం గానే దీర్ఘకాలిక కాంట్రాక్టు లకు వెళ్ళటం లేదని వెల్లడించారు. 25 ఏళ్ల పాటు అదనంగా ఎందుకు చెల్లించాలని.. ఇతర రాష్ట్రాల లాగే బిడ్డింగ్ చేసి కొనుగోలు చేస్తున్నామని ప్రకటన చేశారు.వ్యవసాయ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని.. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా కోతలు లేవని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news