ఏపీలో నాలుగేళ్లలో రాష్ట్ర ప్రజలు వివిధ పన్నుల రూపంలో చెల్లించింది ఖజానా కు చేరాల్సి ఉండగా అది ప్రవేట్ వ్యక్తుల ద్వారా ప్రభుత్వ పెద్దల సొంత ఖజానాకు మల్లించుకున్నరని ఆరోపించారు టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి. మొన్న లిక్కర్, ఇసుక టెండర్ల పేరుతో ప్రవేట్ వ్యక్తులకు ఇచ్చారని.. ఇప్పుడు మైనింగ్ కు సంబంధించి సీనరీ చార్జీల వసూళ్లు కూడా ప్రవేట్ వ్యక్తులకు ఇవ్వడం వెనుక పెద్ద దోపిడీ జరుగుతోందన్నారు.
మైనింగ్ సీనరీ డబ్బులు కూడా దారి మళ్ళించేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందన్నారు శ్రీనివాసుల రెడ్డి. మట్టి, ఇసుక ఇటుక, ఎదైనా మినరల్స్ తో రోడ్డుపై వాహనం వెళితే ఆపి పన్నులు వసూలు చేసే విధంగా అనుమతి ఇవ్వడం దారుణం అన్నారు. ప్రవేట్ వ్యక్తులకు మైనింగ్ రాయల్టీ వసూలు చేసే అధికారం ఇచ్చి తద్వారా సొంత ఖజానాకు తరలించే ప్రయత్నం జరుగుతోందన్నారు.
ఈ ఆప్షన్ టెండర్ లో ఇంటర్ నేషనల్ బిడ్డింగ్ జరపకుండా వైసిపి నేతలకు కట్టబెట్టెందుకు సింగల్ టెండరు ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తులు సీనరైజ్ ను అవుట్ సోర్సింగ్ ఇచ్చి దోపిడీకి అనుమతి ఇచ్చినట్లే అవుతుందన్నారు. అవుట్ సోర్సింగ్ సినరీ ఛార్జీలు వసూలు చేస్తే రసీదు పొందాలని, ఆ రసీదు నిజమైంది అవునో కాదో చెక్ చేసుకోవాలన్నారు.