ఎంతో మంది గోమాతని పూజిస్తారు. కొన్ని కొన్ని సార్లు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా చిన్న చిన్న గ్రామాల్లో, పల్లెటూర్లలో ప్రతి రోజు గోమాతకు పూజలు చేస్తూ ఉంటారు. అయితే నిజంగా గోమాతను పూజించడం వల్ల ఏమవుతుంది..?, ఎటువంటి కష్టాలు దూరమవుతాయి..? ఇలా అనేక విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం.
పండితులు మనతో గోమాతకి పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి చెప్పడం జరిగింది. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేద్దాం. చాలా మంది గోమాతను పూజించడం మనం చూస్తూ ఉంటాం. ఇది ఇలా ఉంటే గోమాతను సకల దేవతా స్వరూపంగా వర్ణించడం జరిగింది. ఇలా ఇటువంటి స్వరూపం కలిగిన గోమాతను పూజ చేయడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని పురాతన కాలం నుంచి ప్రగాఢంగా నమ్ముతున్నారు.
గోవు పాదాల లో పితృదేవతలు అలానే గొలుసు తులసి దళములు, కాళ్ళ లో సమస్త పర్వతాలు మారుతి తదితరులు ఉన్నారని పండితులు అంటున్నారు. అదే విధంగా గోమాత నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదాలుగానూ, భ్రూమద్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖం లో జ్యేష్ఠా దేవి, కళ్ల లో సూర్యచంద్రులవారు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ – ఇంద్రులు వున్నారని పండితులు చెప్పారు.
అలానే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ – ప్రయాగ నదులు కూడా ఉంటాయి. అందుకే గోమాతని పూజిస్తారని. ఇలా పూజించడం వలన పుణ్యం వస్తుంది అని అంటున్నారు.