సీఎం చంద్రబాబే మేము కట్టిన కట్టడాన్ని మెచ్చుకున్నాడు. కానీ ప్రజలని తప్పు దోవ పట్టించి జగన్ కోసం కట్టుకున్న ప్యాలెస్ గా చెప్తున్నాడు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు తాత్కలింగా అమరావతి లో నిర్మిస్తే జగన్ శాశ్వత అద్భుత భవనాల్ని నిర్మించారు. అమరావతిలో 1100 కోట్లు ఖర్చుపెట్టి టెంపరరీ భవనాలు కట్టారు. చంద్రబాబు కట్టిన భవనాల్లో వర్షం వస్తె నేరుగా చాంబర్లోకి నీరు వచ్చేది. కానీ జగన్ పర్మినెంటిగా ఋషికొండలో భవనాలు నిర్మించారు. నేను మంత్రిగా వున్నప్పుడు నా ఛాంబర్లో బాత్ రూమ్ కి వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటి కట్టడాలు చంద్రబాబు కట్టాడు. అమరావతి లో కట్టిన భవనల్ని, జగన్ కట్టిన భవనల్ని ప్రజలకి చూపించండి. ఏ భవనాలు పర్మినెంటిగా కట్టారో ప్రజలే చెబుతారు అన్నారు.
ఇక ప్రభుత్వం కి సంబంచిన టూరిజం ప్లేసులో జగన్ ఎలా సొంతంగా భవనాలు కట్టుకుంటారు. ప్రజల్ని చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారు… దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. పోలవరం పనులు మా హయాంలో ఎక్కువుగా జరిగితే ఏమి కాలేదు అని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా వుంది. తాత్కాలిక భవనాలు కోసం వేల కోట్లు ఖర్చు పెట్టిన మీరు జగన్ తక్కువ ఖర్చుతో శాశ్వత భవనాలు నిర్మిస్తే ఎందుకు ఏడుస్తారు. సూపర్ సిక్స్ అన్నారు సింగిల్ రన్ కూడా తీయలేదు, ఇంకా ఎప్పుడు సూపర్ సిక్స్ కొడతారు. నాన్నకి ఇంధనం దొరికింది తప్ప అమ్మ కి వందనం దక్కలేదు. బార్లలో తగ్గింపు ధరలకే మద్యం అని బ్యానర్ లో కట్టారు, కానీ పెరుగుతున్న నిత్యావసర ధరలు తగ్గింపు ధరల బ్యానర్లు ఎక్కడ కనిపించవే. మీరు ఏమి పరిపాలన చేస్తున్నారు.. ఇప్పటికి జగన్ మీద పడి ఏడుస్తున్నారు, ఏడుపు ఆపి ప్రజలకి న్యాయం చెయ్యండి. మీరు చేసిన దుబారా ఖర్చులతో పోల్చితే మేము రుషికొండలో నిర్మించిన శాశ్వత భవనాలు మంచి కార్యక్రమాలే అని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.