ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మండి పడ్డారు. కడియం శ్రీహరి కావూరం ఎక్కి కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడుతుండు. పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేల్లో మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి. నమ్మకద్రోహి,జిత్తులు మారి నక్క గా పేరున్న కడియం శ్రీహరి కేటిఆర్ పై మాట్లాడడం సిగ్గు చేటు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్ ప్రభుత్వం,అందుకే కేటిఆర్ పాదయాత్ర చేపడుతున్నడు. కేటీఆర్ పై కడియం నిరదరమైన ఆరోపణలను కండిస్తున్న. కడియంకి రేవంత్ రెడ్డిని కలిసే దిక్కు లేకుండా పోయింది. పార్టీలు మారడంలో కడియం శ్రీహరి మెరుపు వీరుడు,హైట్రిక్ సాధించాడు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వీరుడు కడియం.
కేసీఆర్ కు ఎవరు చేయని నమ్మకద్రోహం చేసి 100 కోట్లకు అమ్ముడు పోయినా నికృష్టుడు కడియం శ్రీహరి. తాత ముత్తాతల నుండి ఆస్తి పరులైన కేసీఆర్,కేటిఆర్ పై కడియం శ్రీహరి స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడు. కడియం శ్రీహరి భారత్ నుండి మలేషియా,సింగపూర్ కు హవాలా ద్వారా డబ్బులు పాపించి తన కూతురు అల్లుడు ద్వారా ఆస్తులు కొనుగోలు చేశారు. కడియం శ్రీహరి 1995లో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతిపై కల్నాయకని ఒక పుస్తకం వచ్చింది. 1992లో రాజకీయాలకు వచ్చినప్పుడు నీ ఆస్తి ఎంత ఇప్పుడు మీ ఆస్తి ఎంత. అప్పుడు గచ్చు నేలతో ఉన్న నీ ఇల్లు ఇప్పుడు 10 కోట్లతో హనుమకొండ నడి బొడ్డున ఎలా వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతనం కావడానికి కడియం శ్రీహరి సూత్రధారిగా అవుతాడు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను చిత్రహింసలకు గురి చేస్తుంటే వాళ్లు రోడ్లపైకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. నిన్ను గెలిపించిన ప్రజలకు మోసం చేసినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి అని తాటికొండ రాజయ్య డిమాండ్ చేసారు.