నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలో పొరపాటు జరిగింది. మంత్రి రామనారాయణ రెడ్డి విషయంలో కూడా.. ఇది బాధాకరమైన విషయం అని నెల్లూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఏదో జరిగింది.. నేను కూడా చింతిస్తున్నా. కానీ భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాం అని అన్నారు.
అందరూ అందరినీ గౌరవించాల్సిన అవసరం ఉంది. అయితే నెల్లూరు జిల్లాకు డి.డి.ఆర్.సి చైర్మన్ గా రావడం సంతోషంగా ఉంది. వివిధ శాఖల మీద సమీక్షను నిర్వహించాం. ప్రధానంగా జలవనరుల శాఖ జిల్లాకు ఎంతో కీలకమైనది. దాదాపు ఏడున్నర లక్షల ఎకరాల మేర వరిని సాగు చేస్తున్నారు. అధికారులు.. ప్రజాప్రతినిధులు కుటుంబంలా కలిసి పని చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమాలను మరింత పకడ్బందీగా అమలు చేస్తాం. ఆదివారం కూడా అధికారులు వచ్చారు. దానికి అందరికీ కృతజ్ఞతలు. ఇక నుంచి క్రమం తప్పకుండా డి.డి.ఆర్.సి సమావేశాలను నిర్వహిస్తాం అని మంత్రి ఫరూక్ స్పష్టం చేసారు.