హెడ్‌మాస్ట‌ర్ కోట‌య్య మృతి.. మ‌ళ్లీ అనుమానాలు మొద‌లు!

కోట‌య్య‌.. ఆనంద‌య్య క‌రోనా మందుతో కోలుకున్నాన‌ని చెపిన వ్య‌క్తి. ఆయ‌న వీడియో చూశాకే ఆనంద‌య్య మందుకు డిమాండ్ పెరిగింది. ఆయ‌న వీడియో చూసిన వారే వేలాదిగా కృష్ణ‌ప‌ట్నంకు త‌ర‌లారు. అలాంటి వ్య‌క్తి పూర్తి స్థాయిలో కోలుకోలేదు. మ‌ళ్లీ హాస్పిట‌ల్లో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఆనందయ్య క‌రోనా మందుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో.. కోటయ్య ఆరోగ్యం పైనే అంద‌రి దృష్టి ఉంది. ఆనందయ్య మందు పని చేస్తోందని చెప్పడానికి.. కోటయ్య ఆరోగ్యమే కారణమంటూ అప్ప‌ట్లో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డిచింది.

కానీ చివ‌ర‌కు ఆయ‌న అదే కరోనాకు బ‌ల‌య్యాడు. అయితే కోట‌య్య కూ ఆ ఆనంద‌య్య మందు ఇస్తున్నాడని తెలియగానే.. వెళ్లి తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకేసారి కోలుకున్న‌ట్టు చాలా ఆరోగ్యంగా కనిపించారు. దీంతో అంద‌రూ షాక్ అయ్యారు. ఆనందయ్య మందు సూప‌ర్ అంటూ మెచ్చుకున్నారు. కానీ త‌ర్వాత మ‌ళ్లీ కోట‌య్య అనారోగ్యపాల‌య్యారు. కంటిని పరీక్షించిన వైద్యులు సమస్యలు గుర్తించారు. టాక్సిక్ కెరటైటిస్ వ్యాధి మొదలైనట్లు తేల్చారు. చివ‌ర‌కు ఆయ‌న చ‌నిపోయారు.