బెజవాడ గ్యాంగ్ వార్ ఇంకా ఆగలేదా…?

గత ఏడాది బెజవాడ గ్యాంగ్ వార్ లో ప్రధాన నిందితుడుగా ఉన్న మణికంఠ అలియాస్ పండు మరోసారి చెలరేగిపోయాడు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి స్నేహితుడుకు పుట్టిన రోజు పార్టీ ఇచ్చాడు. పార్టీ ఇచ్చిన తరువాత పండు గ్యాంగ్ స్నేహితుడు పై కత్తులు, కర్రలతో దాడి చేసింది. తనను వదిలైయండి… అంటు ఎంత వేడుకున్నా సరే పండు గ్యాంగ్ వదల్లేదు.

గడచిన ఏడాది లాక్ డౌన్ ఉన్న మార్చి నెలలో పండు, తోట సందీప్ వర్గాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. మారణాయుధాలతో‌ చేసుకున్న దాడుల్లో సందీప్ మరణించి నేటికి ఏడాది అవుతుంది. అప్పట్లో పండుతోపాటు 40 మందిపై విజయవాడ పోలీసులు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసారు. పండు ను అదుపులోకి తీసుకుని పెనమలూరు పోలీసులు విచారిస్తున్నారు.