BREAKING : నిలకడగా ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం

-

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉందని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రకటించారు. శ్రీలక్ష్మి ఐసీయూ లో చికిత్స పొందుతున్నారని వివరించారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఎవరిని లోపలికి అనుమతించడం లేదన్నారు. కాగా, కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి షాక్‌ ఇచ్చారు సీబీఐ అధికారులు.

తాజాగా కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది సీబీఐ. వైఎస్‌ వివేకా కేసులో భాగంగా కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు ఇచ్చింది. నిన్న సీబీఐ ముందు కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరుకావాల్సి ఉంది. కానీ.. కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లికి గుండె పోటు రావడంతో.. హాజరుకాలేకపోయాడు. ఈ తరుణంలోనే.. ఇవాళ కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news