నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ

-

నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరుగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే… హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.

Chandrababu Fiber Net case hearing in Supreme Court today

సాక్ష్యా ధారాలు సమర్పించినా సరే తమ వాదన పరిగణలోకి తీసుకోలేదని ఆరోపణలు చేశారు. ఇక ఇవాళ ఈ కేసు విచారణను జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జరపనుంది. Court no 16/ case no 64 ను ఇవాళ విచారణ చేయనుంది.

కాగా, డిసెంబరు ఒకటో తేదీన చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రానికే తిరుమల చేరుకోనున్న ఆయన రాత్రి కొండ మీదే బస చేయనున్నారు. శ్రీవారి దర్శనం అయ్యాక రేణిగుంట విమానాశ్రయం నుంచి అమరావతి చేరుకుని అక్కడి నుంచి.. విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news