విజయవాడ విజయ డైరీ పాల ఫ్యాక్టరీ కి భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ విజయ డైరీకి రూ.75 కోట్లు నష్టం జరిగినట్టు అంచెనా వేశారు. ఇంకా వరద నీటిలోనే విజయవాడ పాల ఫ్యాక్టరీ ఉంది. వారం రోజుల కింద ఐదు అడుగుల ఉన్న నీరు ఈ రోజు రెండు అడుగులకు ఉన్నది వరద నీరు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విజయ డైరీ లో పాల ప్రాసెసింగ్ యూనిట్లు, పెరుగు ప్రాసెసింగ్ యూనిట్లు, బటర్ ప్రాసెసింగ్ యూనిట్లు పూర్తిగా పాడై పోయాయి.
విజయవాడ పాల ఫ్యాక్టరీ నుంచి దాదాపు నాలుగు లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి జరిగేది. 2 లక్షల పాలు విరవల్లి నుంచి జరిగేది. విజయవాడ పాల ఫ్యాక్టరీ కి వరద నీరు రావడం తో 6 లక్షలు విరవల్లి నుంచే ఉత్పత్తి జరుగుతుంది. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాలను విరవల్లి నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. మోటార్లు, మిషన్లకు మరమ్మత్తులు చేస్తున్నారు ఫ్యాక్టరీ సిబ్బంది. గత వారం రోజుల నుంచి కరెంట్ కట్ అయింది. దీంతో భారీగా పాలు, పెరుగు, బట్టర్ మిల్క్ పాడైపోయాయి. దీంతో దాదాపు 600 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు.