ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం, తర్లుపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. జోరు వానతో తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే రహదారి జలమయమైంది. వాగులు పొంగి చెరువులకు వర్షపు నీరు చేరింది.
మరోవైపు రుతుపవనాల ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కోవూరు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో భారీతెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక ప్రకటన వెలువడింది. రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి బుతుపవనాలు జోరందుకుంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.