అలర్ట్ : మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ఏపీకి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి ఉపరితల ఆవర్తనం ప్రస్తుతము ఉత్తర బంగాళాఖాతం & దానిని ఆనుకుని వున్న తూర్పు మధ్య బంగాళాఖాతం లలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కి మీ వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళే కొలది నైఋతి దిశ వైపుకు వంగి కొనసాగుతున్నది. దీని ప్రభావం వలన రాగల 24 గంటలలో ఉత్తర & దానిని ఆనుకుని వున్న మధ్య బంగళాఖాతం లలో ఒక “అల్ప పీడనం” ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు షీర్ జోన్ (ద్రోణీి) 14°N అక్షాంశము వెంబడి సగటు సముద్రమట్టానికి 5.8 km నుండి 7.6 km ఎత్తుల మధ్య కొనసాగుతున్నది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు తీరం వెంబడి ఈదురుగాలులు 40-50 kmph వేగంతో వీచే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు, రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు; నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు తీరం వెంబడి ఈదురుగాలులు 40-50 kmph వేగంతో వీచే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు అనంతపురం కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.