ఏపీ ప్రజలకు అలర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా… ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ వాతావరణశాఖ పేర్కొంది. అల్పపీడనంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ముఖ్యంగా ఏపీ తీర ప్రాంత రాష్ట్రాలైన ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ లలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కులుస్తాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ అల్పపీడనం గురువారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం అర్ధరాత్రి నాగపట్నంలో అతిభారీ వర్షం కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఇదే తరహా వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 100% సిద్ధంగా ఉందని తమిళనాడు రెవెన్యూ విపత్తు నిర్వహణశాఖ మంత్రి కేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ మంగళవారం తెలిపారు.