విశాఖ గీతం యూనివర్సిటీ మెయిన్ గేట్ కూల్చివేత.. తీవ్ర ఉద్రిక్తత

-

విశాఖ గీతం యూనివర్సిటీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. విశాఖలోని గీతం యూనివర్సిటీ గోడలు, ప్రధాన ఎంట్రెన్స్ ని రెవెన్యూ అధికారులు కూలగొడుతున్నారు. అక్రమ నిర్మాణంగా గుర్తించి చర్యలు రిషికొండ, ఎండాడ పరిధిలో 40.51 ఎకరాల్లో గీతం యాజమాన్యం చేపట్టిన నిర్మాణాలపై రెవెన్యూ యంత్రాంగం విచారణ చేపట్టింది. ఆ బృందం సిఫార్సుల ఆధారంగా చర్యలు తీసుకుని కూల్చివేతలు మొదలు పెట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీగా పోలీసుల మోహరించారు.

విశాఖ ఆర్డీవో కిషోర్ ఆధ్వర్యంలో మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది ఈ కూల్చివేతలకి దిగారు. బయటి వ్యక్తులను బీచ్ రోడ్డు వైపు అనుమతించడం లేదు పోలీసులు. గీతం ఆధీనంలో 48 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు గుర్తించామని అధికారులు చెబుతున్నారు. రెండు నెలలుగా స్పెషల్ డ్రైవ్ జరుగుతోందని ఆర్డీవో కిశోర్ పేర్కొన్నారు. గీతం ఆక్రమణలో ప్రభుత్వ భూములు గుర్తించామన్న ఆయన యూనివర్సిటీ మెయిన్ గెట్ తొలగింపు కూడా అందులో భాగమేనని పేర్కొన్నారు. యాజమాన్యానికి సమాచారం ఇచ్చాకనే చర్యలు తీసుకున్నామని అయన తెలిపారు. అయితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని వర్సిటీ యాజమాన్యం ఆరోపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news