ఎల్. జి పొలిమర్స్ హిస్టరీ ఇదే, విషవలయంలో విశాఖ…!

-

విశాఖలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర గ్యాస్ ప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ప్రమాద౦లో ఇప్పుడు వేలాది మంది అస్వస్థతకు గురయ్యారు. మరికొంత మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఘటనపై స్పందించారు. చిన్న పిల్లలు, వృద్దులు అందరూ కూడా ఇప్పుడు విష వలయంలో చిక్కుకున్నారు.

ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ఈ సంఘటన దెబ్బకు విశాఖ ప్రజలు వణికిపోయారు. సిఎం వైఎస్ జగన్ కూడా ఇప్పుడు విశాఖ వెళ్తున్నారు. అసలు దీని చరిత్ర ఒక్కసారి చూస్తే, ఎల్. జి సౌత్ కొరియకి చెందిన కంపేని. ఎల్.జి కంపెనీని విశాఖలో 1961వ సంవత్సరంలో స్థాపించారు. ఎల్.జి మొదట భారత్ లో తమ అనుబంధ సంస్థగా 1961లో హిందూస్థాన్ పొలిమర్స్ కి అనుమతి ఇచ్చి హిందూస్థాన్ పోలిమర్స్ ని స్థాపించింది.

1978 లో పూర్తి స్థాయిలో ఎంసి డో వెల్, యూబీ గ్రూప్ ఎల్. జి అనుమతి తో హిందూస్తాన్ పొలిమర్స్ ని టెకోవర్ చేసుకున్నారు. 1997లో ఎల్. జి పూర్తి స్థాయిలో యూబీ గ్రూప్, ఎంసి డో వెల్ నుంచి టెకోవర్ చేసుకుంది. పరిస్థితిని కేంద్రం కూడా గమనిస్తుంది. విపత్తు నిర్వహణ శాఖ కేంద్ర హోం శాఖ దీనిపై అప్రమత్తమైంది. ప్రత్యేక బృందాలను ఏపీకీ పంపిస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news