విశాఖలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర గ్యాస్ ప్రమాదం ఇప్పుడు విషాదంగా మారింది. వేలాది మంది ప్రజలు ఇప్పుడు గ్యాస్ విష వాయువుల కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. వేలాది మందిని ఆస్పత్రుల్లో జాయిన్ చేసారు. ఇప్పుడు ఈ గ్యాస్ దుర్ఘటనను భోపాల్ గ్యాస్ దుర్ఘటనతో పోలుస్తున్నారు. 1984లో అర్ధరాత్రి సమయంలో గ్యాస్ లీక్ కావడంతో దాదాపు 4వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన కూడా అర్ధరాత్రి సమయంలోనే జరిగింది. యూనియన్ కార్బయిడ్ రసాయనాల కర్మాగారం నుంచి వ్యాపించిన టన్నుల కొద్ది విష వాయువు విడుదలైన 24 గంటల్లోనే మూడు వేల మంది వరకు మరణించారు. ప్రస్తుత విశాఖ ఘటనలో దాదాపు రెండు వేల మంది ఆస్పత్రుల్లో ఉన్నట్టు సమాచారం. కేంద్ర బృందాలు అప్రమత్తం అయినా సరే పరిస్థితి అదుపులోకి రావడం లేదు.
అధికార యంత్రాంగం కూడా ఇప్పుడు చర్యలు చేపట్టలేని స్థితిలో ఉంది. పోలీసులకు కూడా ఇప్పుడు ఆశ్వస్తత గురైఆస్పత్రుల్లో జాయిన్ అయ్యారు. మరణాలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. అయితే ఇళ్ళల్లో ఎంత మంది ఉన్నారు, ఎంత మంది చికిత్స పొందుతున్నారు అనేది స్పష్టత రావడం లేదు.