పక్కా ఆధారాలతో సీఐడీ రిపోర్టు అందించింది. దొంగను అరెస్ట్ చేస్తే.. మానవ హక్కులను భంగం కలిగించారంటే ఎలా ? అని ప్రశ్నించారు సజ్జల. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. స్కిల్ స్కామ్ తో రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగింది. నేషనల్ ఏజెన్సీలు కూడా దోపిడీలు జరిగాయని ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదని సీమెన్స్ చెబుతోంది. టీడీపీ హడావిడితో అసలు విషయం పక్కకుపోతుంది. కుట్రతో రాష్ట్రంలో వందల కోట్లు నష్టం కలిగించారు. అసలు మాకు డబ్బు రాలేదని సీమెన్స్ పేర్కొంటుంది.
ఈడీ కూడా హవాలాపై విచారణ జరిపింది అన్నారు సజ్జల. టీడీపీ నేత దబాయింపులకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బాబును హింసిస్తున్నారంటూ టీడీపీ నేతలు దుష్ప్రాచారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో డబ్బు ఎవ్వరి చేతి నుంచి ఎవ్వరికీ వెళ్లాయి. రాత్రికి రాత్రే దేశం దాటించారు. యువతకు సంబంధించిన డబ్బు ఇది.. చంద్రబాబు యువతను మోసం చేశాడు. దేశంలో ఉన్న చట్టాలకు చంద్రబాబు అతితీడా అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి. సానుభూతి, వ్యతిరేకత ధోరణి రావాలని.. రాజకీయ ధోరణిలో ప్రయోజనం రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు.