తమ భూమి కబ్జా చేశారని సీఐ కాళ్ల మీద పడ్డ బాధితురాలు

-

తెలంగాణలో అధికార పార్టీకి చెందిన నాయకుడు తక్కువ ధరకు తమ భూమిని లాక్కోవాలని చూస్తున్నానని తమకు న్యాయం చేయాలని బాధితురాలు సిఐ కాళ్ళ మీద పడి వేడుకుంది. ఈ ఘటన వెల్దుర్తి మండలం హస్తాల్ పురం లో శివారులో చోటుచేసుకుంది. శివంపేట మండలం కొంతంపల్లికి చెందిన బొగ్గుల బిక్షపతి జయం మా దంపతులకు వెల్దుర్తి మండలం హస్తాలు శివారులో ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమి కలదు.

ఈ భూమిలో సుమారు నాలుగు ఎకరాల స్థలాన్ని శివంపేట పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అక్రమంగా కబ్జా చేశాడని తమకు రక్షణ కల్పించాలని బాధితురాలు సోమవారం ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది ఈ మేరకు తూప్రాన్ సిఐ శ్రీధర్ మంగళవారం హస్తల్పూర్ శివారులో విచారణ చేపట్టారు తమ వ్యవసాయ బోరుబావిని సైతం స్వాధీనం చేసుకున్నాడని అడిగితే బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది

ఇక అదే గ్రామానికి చెందిన మరొక రైతు కూడా లక్ష బాతను కబ్జా చేశారని పొలాల్లోకి వివరించారు. వారసత్వంగా వచ్చిన భూమిని ఆక్రమించిన వ్యక్తిపై చట్టపర చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ సీఐ శ్రీధర్ రెడ్డి కాళ్ళ మీద పడి బాధితురాలు వాపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news