ఆంధ్రప్రదేశ్ లో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు సింగిల్ గా పోటీ చేయగా.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమితో పోటీ చేశాయి. కొందరూ టీడీపీ అధికారంలోకి వస్తుందని చెబుతుండగా.. మరికొందరూ మరోసారి వైసీపీనే అధికారంలోకి వస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఏపీలో జూన్ 04న వెలువడే ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల ఫలితాల కంటే ముందే పవన్ వద్ద బీజేపీ రెండు ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించినట్టు సమాచారం. ఫలితాల తరువాత నిర్ణయం ఏపీలో భవిష్యత్ లో పార్టీ ఎదగాలంటే పవన్ మద్దతు అవసరమని బీజేపీ నాయకత్వం గుర్తించినట్టు సమాచారం. కూటమికి అధికారం దక్కకుంటే మాత్రం పవన్ తో కలిసి ఏపీలో బలోపేతం కావాలనేది బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కూటమికి అధికారం దక్కకపోతే పవన్ ను కేంద్రంలో మోడీ కేబినెట్ లో సహాయ మంత్రిని చేయాలనేది ఆ పార్టీ నాయకత్వం ఆలోచనగా విశ్వసనీయ సమాచారం.