జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని అన్నారు. పవన్ కళ్యాణ్ నిర్వహించే ప్రతి సభలో ఆయన అభిమానులు సీఎం, సీఎం అని రంకెలు వేస్తున్నారని.. ఆయన ” సీఎం పవన్ కళ్యాణ్” అనే సినిమా తీసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అవసరమైతే ఆ సినిమాకి తానే ప్రొడక్షన్ చేస్తానని తెలిపారు
ఆ సినిమా ద్వారానైనా పవన్ కళ్యాణ్ తెరపై తనని తాను సీఎంగా చూసుకోవచ్చని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పక్కవారి గెలుపు కోసమే పని చేస్తారని.. 2024 లో అయినా 175 సీట్లలో పోటీ చేస్తానని ఆయన చెప్పగలరా? అని ప్రశ్నించారు. కనీసం ఆయనకి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల పేర్లు కూడా తెలియవన్నారు గుడివాడ అమర్నాథ్. అలాంటి వ్యక్తి సీఎం అవుతారా? అని ప్రశ్నించారు.