చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంతో నగరంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఇవాళ టిడిపి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. అటు బాబుతో పాటు జామర్ వెహికల్, రెండు కార్లకు జైల్లోకి అనుమతిచ్చారు. హై ప్రొఫైల్ వ్యక్తి కావడంతో NSG బృందం జైల్లో కూడా ఆయనకు భద్రతగా ఉంది.

అలాగే, రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. జైలుకెళ్లే రోడ్డును బారికేడ్లతో బ్లాక్ చేశారు పోలీసులు.. డీఎస్పీ నేతృత్వంలో జైలు వద్ద పటిష్టమైన భద్రత కల్పించారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు.. చంద్రబాబుకు అల్పాహారం అందజేసిన జైలు సిబ్బంది.. బ్రేక్‌ఫాస్ట్‌గా ఫ్రూట్ సలాడ్ అందించింది. అల్పాహారంతో పాటు వేడినీళ్లు, బ్లాక్ కాఫీ.. చంద్రబాబు నివాసం నుంచి అల్పాహారం, మెడిసిన్ తెచ్చింది సిబ్బంది.