ఒక పొలిటీషియన్ జైలుకు వెళ్లడం బాధాకరమే అంటూ ఏపీ మం త్రి అంబటి రాంబాబు సెటైర్లు పేల్చారు. సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆధారాలు లేకుండా కోర్టులు, తీర్పులు ఇవ్వవనే విషయాన్ని టిడిపి నేతలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
బాబు అరెస్టుతో సానుభూతి కోసం టిడిపి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు జీవితమంతా అవినీతిమయమనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, ఇన్ని రోజులు వ్యవస్థలను మేనేజ్ చేశారని విమర్శించారు.
ఆధారాలు లేకుండా కోర్టులు తీర్పులు ఇవ్వవు అని గుర్తుంచుకోవాలి.. సానుభూతి పొందాలని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు.. ఎంత అవినీతి చేసినా వ్యవస్థల్ని మేనేజ్ చేయ గలరని ఇంతకాలం నమ్మారని తెలిపారు. ఈ నెల 9న ఉదయం అరెస్ట్ చేసినప్పటి నుంచి రాజకీయ డ్రామాలు చేశారని ఆగ్రహించారు. నంద్యాల నుంచి విజయవాడకు హెలికాప్టర్‌లో తీసుకెళ్తామన్నా, రాజకీయాల కోసం రోడ్డుమార్గంలో వస్తామన్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు.