ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయంపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. ఆన్ లైన్లో సినిమా టిక్కెట్ల జీవో నెంబర్ 69ని నిలుపుదల చేయాల్సిందిగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్కు ఆదేశాలు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు.
తాము అనుమతి ఇచ్చే వరకు ఆపాల్సిందేనని పేర్కొంది కోర్టు. జీవో నెంబర్ 69 జారీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
అయితే.. ఈ పిటీషన్ ను ఇవాళ విచారించిన ఏపీ హై కోర్టు.. ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయంపై స్టే ఇచ్చింది. ఇక ఈ నెల 27వ తేదీకి విచారణ వాయిదా పడింది. దీనిపై జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.