గోదావరికి పోటెత్తిన వరద.. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత!

-

గోదావరి నదిలోకి వరద నీరు పోటెత్తింది. ఈ మేరకు మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరింది. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందుకుర్తి త్రివేణి సంగమం వైపు నీరు పోటెత్తింది. నది పరివాహక ప్రాంతంలోని రైతులు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

గోదావరి-వరద
గోదావరి-వరద

బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని ఆయకట్టలకు సాగు నీరు అందనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఏడాది జులై 1 నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు ఎత్తివేస్తున్నారు. ఎస్సారెస్పీకి 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్ సమీపంలో బాబ్లీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. దీంతో ఎస్సారెస్పీకి వచ్చే వరద నీరుకు మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన ప్రతిఏటా జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరవాలని ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news