2 నెలల వ్యవధిలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులను పూర్తి చేస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇవాళ నంద్యాల పరిధిలోని బనగానపల్లె లో పలు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ….మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్వాకం వల్ల యాక్సిడెంట్లు జరుగు తున్నాయన్నారు.
ఎన్నికల ముందు జగన్ వస్తున్నారని హడావుడిగా నాణ్యత లేని పనులు చేశారని ఆగ్రహించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆర్భాటాల కోసం రోడ్లు సెంట్రల్ లైటింగ్ అంటూ ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసేందుకు నాణ్యత లేని పనులు చేశారని తెలిపారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. బనగానపల్లె లో ఎక్కడా రోడ్లలో గుంతలు లేకుండా , డ్రైనేజీల్లో మురికి నీరు నిలువ లేకుండా చేస్తామన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. 2 నెలల వ్యవధిలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులను పూర్తి చేస్తామని ప్రకటించారు. రూ.3 కోట్ల వ్యయంతో త్వరలోనే సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మాణ పనులు చేపడతామన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.