క్లాసులో పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్ధులు, ప్రిన్సిపాల్ నిర్ణయం ఇది…!

-

ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అనేది సర్వ సాధారణం అనే విషయం తెలుసు. అయితే చిన్న వయసులో, ఏ మాత్రం కూడా ఆలోచన లేని వయసులో ప్రేమించడం పెళ్లి చేసుకోవడం అనేది తప్పు. చిన్న వయసులో ఉన్న వారు చాలా మంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని నాశనం అవుతూ ఉంటారు. తాజాగా రాజమండ్రిలో జరిగిన ఒక ఘటన విస్మయానికి గురి చేస్తుంది.

రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విద్యార్థులు ప్రేమ వివాహం చేసుకున్నారు. విద్యార్థులు ఎంపీసీ గ్రూపుకి చెందిన వారని కాలేజి గుర్తించింది. నవంబర్ 17 న ఘటన జరిగింది. ముగ్గురు విద్యార్థులు కు టీసీలు ఇచ్చి కళాశాల ప్రిన్సిపాల్ మేరీ సుజాత పంపించారు. అంతే కాకుండా విద్యార్ధుల తల్లి తండ్రులకు సమాచారం కూడా ఇచ్చారు. వాళ్ళు అందరూ మైనర్లు కావడంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news