కరోనా గురించి ఏపీ సీఎం జగన్ ఏదో లైట్ తీసుకున్నాడని, ఆయన తేలిక చేసి చూస్తున్నాడని, భయంక రానికే భయంకరమైన కరోనా విషయంలో జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని మనోళ్లంతా అసహనం వ్యక్తం చేశారు కానీ, తరచి చూస్తే.. ఇప్పుడు ప్రపంచం మొత్తం కొద్దిగా లేటయినా.. జగన్ వెంటే నడుస్తోం దా? అని అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. కరోనా అనేది వైరస్ అయినా.. దీనివల్ల ప్రపంచం ఏమీ ఆగిపోదని జగన్ అన్నప్పుడు అందరూ నవ్వారు. ఇక, కరోనాతోనే కలిసి జీవించాల్సి వస్తుందని ఆయన ఇటీవల వెల్లడించినప్పుడు ఠాట్!! అంత మాటంటావా? అంటూ నిప్పులు చెరిగారు.
ఇక, కరోనా చిన్నపాటి జ్వరమే అన్నప్పుడు చంద్రబాబు వంటి వారు ప్రజలకు లేఖలు రాసి తిట్టిపోశారు. ఇలాంటి వారు రావడం మన ఖర్మ అన్నారు. దీంతో మనోళ్లు కూడా జగన్ విషయంలో కొంత డైలమాలో పడ్డారు. ఏమో.. జగన్ లైట్ తీసుకున్నాడేమో.. ఆయనకు దీని సీవియార్టీ తెలియడంలేదేమో.. అనుకు న్నారు. కానీ, తాజాగా ప్రపంచ మేధావులుగా గుర్తింపు తెచ్చుకున్నవారు కూడా ఇప్పుడు కరోనా విషయం లో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెబుతుండడాన్ని బట్టి జగన్ చెప్పింది నిజమేనేమో.. అనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
రిజర్వ్‌బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం లాక్‌డౌన్ విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, బాగున్న ప్రాంతాల్లోనూ ప్రజలను బయటకురాకుండా చే యడం వల్ల ప్రయోజనం కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అదేసమయంలో ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎక్కువ కాలం ప్రజలను నిర్బంధించడం వల్ల కరోనా తగ్గదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనాతో సహజీనం ఎలాగూ తప్పనప్పుడు.. ఇప్పుడు లాక్‌డౌన్ వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే.. జగన్ చెప్పిన విషయాలనే ఈ మేధావులు కూడా తమ అభిప్రాయంగా వెల్లడించడాన్ని బట్టి.. అదే నిజమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి జగన్ వ్యాఖ్యలను తప్పుపట్టలేం కదా!?