విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డి ఏర్పాటు చేసిన నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరిపింది. నిర్మించిన కొంత గోడను కూల్చామని కోర్టుకు తెలిపింది జీవీఎంసీ తరపు న్యాయవాది. దీంతో ఖర్చులు ఎవరు భరించారని న్యాయస్థానం ప్రశ్నించింది. జీవీఎంసీ ఖర్చులతోనే కూల్చామని తెలిపారు న్యాయవాది. ఖర్చయిన బిల్లులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది హైకోర్టు.
మిగిలిన నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించడంతో.. మ నోటీసులిచ్చామని, మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులిచ్చినట్లు తెలిపింది జీవీఎంసీ న్యాయవాది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. నిబంధనలకు విరుద్ధంగా నేహారెడ్డి నిర్మాణాలు చేపడుతున్నారని పిల్ దాఖలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్.