బ్లేడ్ బ్యాచ్, రౌడీ ఇజాన్ని పెంచి పోషిస్తున్నది టీడీపీనే : ఎంపీ భరత్

-

బ్లేడ్ బ్యాచ్, రౌడీ ఇజాన్ని పెంచి పోషిస్తున్నది టీడీపీనే అని  ఎంపీ భరత్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.ధర్మయుద్దం అంటూ చంద్రబాబు గత ఎన్నికల ముందు బిజెపి, నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసారు. అమిత్ షా తిరుపతి‌ వస్తే చెప్పులు విసిరించాడు. ఇంత చేసి బిజెపి‌ పెద్దల కాళ్లు పట్టుకోడానికి సిద్దమయ్యారు. పవన్ కళ్యాణ్ ను దూతలా పంపిస్తున్నాడు.ఇప్పుడు‌ కొత్తగా ధర్మపోరాటం అంటున్నారు అని పేర్కొన్నారు.

డ్వాక్రా, రైతు రుణమాఫీ అని మాయమాటలు చెప్పి‌మోసం చేసాడు చంద్రబాబు. బాబొస్తే జాబొస్తుందని నమ్మించి నిరుద్యోగులను మోసం చేయలేదా..?స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులలో జగన్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. పేదరికాన్ని ‌కొలమానంగా చేసుకుని జగన్ పరిపాలన సాగిస్తున్నారు. 2019లో టిడిపిని చంద్రబాబు పెట్టింది కాదు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ, ఆ క్షోభతోనే ఎన్టీఆర్ చనిపోయాడని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో చేతులు కలిపి బిజెపి కోసం పాకులాడుతున్నాడు. ప్రజలే రేపటి కురుక్షేత్ర యుద్దంలో వైసిపి గెలుస్తుంది

Read more RELATED
Recommended to you

Exit mobile version