తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. ఇక టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అటు నిన్న తిరుమల శ్రీవారిని 73, 246 మంది భక్తులు దర్శించుకున్నారు. అంతేకాకుండా 28133 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 4.35 కోట్లుగా నమోదు అయింది.
ఇక అటు తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త…ఈ నెల 19వ తేది నుంచి 27వ తేది వరకు ఆన్ లైన్ లో నవంబర్ నెల దర్శన టిక్కేట్లు విడుదల చెయ్యనుంది టిటిడి. 19వ తేది నుంచి 21వ తేది వరకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ నెల 22వ తేది ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కేట్లు విడుదల కానున్నాయి. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కేట్లు విడుదల కానున్నాయి. ఇక ఈ నెల 23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టిక్కేట్లు విడుదల కానున్నాయి.