రాష్ట్రంలో నగరపాలక సంస్థలు.. మున్సిపాలిటీలలో జగన్, బొత్స లు దోచుకున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ రెడ్ది సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వందల కోట్లు ఎలా దోపిడీ చేయాలో ఐఏఎస్ అధికారులు వీరికి నేర్పించారు. మార్టిగేజ్ ముసుగులో నెల్లూరు కార్పొరేషన్ లో దోపిడీ చేశారు. డబ్బులు ఇస్తే కార్పొరేషన్ లొ ఏ తాకట్టు నైన రిలీజ్ చేశారు.
మార్ట్ గేజ్ లో ఉన్న 72 భవనాలను నిబంధనలకు విరుద్ధంగా రిలీజ్ చేయడం వల్ల రూ. 65 కోట్లు కార్పొరేషన్ కు నష్టం వచ్చింది. ఇంకా వంద ఫైల్స్ ఉన్నాయి. కార్పొరేషన్ లొ అవినీతికి ప్రధాన కారణం ఐ ఏ ఎస్ అధికారులు హరిత, వికాస్ మర్మాత్, అసిస్టెంట్ కమిషనర్ చిన్నడు. తప్పు చేసిన బిల్డర్ల మీద కేసులు ఎందుకు పెట్టలేదు. కార్పొరేషన్ లో ఉద్యోగి కాకపోయిన ఒక వ్యక్తి మార్టిగేజ్ ను రిలీజ్ చేసాడు. మంత్రి నారాయణ చొరవ తీసుకుని. అవినీతికి పాల్పడిన వారి పై చర్యలు తీసుకోవాలి. విచారణ అధికారిగా ఉన్న డిఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. నాకు దొరికిన ఆధారాలు డిఎస్పీ కి దొరకలేదా..? అని ప్రశ్నించారు.