ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మంగళవారం పల్నాడు జిల్లా జూలకల్లులో లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 178 వ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా గురజాల నియోజకవర్గంలో కళాకారులు నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. అన్నదాతల సమస్యల పరిష్కారంలో సీఎం జగన్ విఫలమయ్యారని విమర్శించారు.
జగన్ కు దోపిడి పై ఉన్న శ్రద్ధ.. రైతుల సమస్యల పరిష్కారం పై లేదన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే సాగర్ కాల్వను ఆధునికరిస్తామని.. ఆయకట్టు చివరి ఎకరం వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరికొద్ది నేలల్లో చంద్రన్న ప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని భరోసా ఇస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు.