AP : మిచౌంగ్ ఎఫెక్ట్.. కేంద్రం రూ.493కోట్ల సాయం

-

మిచౌంగ్ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ. 498.60 కోట్ల ఎన్డిఆర్ఎఫ్ నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీ ఆదేశించినట్లు హోం శాఖ మంత్రి తెలిపారు. తుఫాను ప్రభావం ఏపీ, తమిళనాడు ఎక్కువగా ఉందన్నారు.

Michoung effect Centre’s assistance of Rs.493 crores

TNకు రూ. 450 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల క్షేమం కోసం కేంద్రం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. కాగా, నేడు సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతి, బాపట్ల జిల్లాల పర్యటించనున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయి పర్యటించనున్నారు జగన్‌. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌….తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వద్ద స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. గ్రామస్ధులు, తుపాను బాధితులతో నేరుగా మాట్లాడనున్న సీఎం జగన్….అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారి పాలెంకు చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news