కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదు, ఓటు లేదని విమర్శలు చేశారు సీఎం జగన్. ఇవాళ కుప్పం నియోజక వర్గంలో పర్యటించిన సీఎం జగన్ బహిరంగ సభలో ప్రసంగించారు. కుప్పం నుంచి మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. 26,39,703 మందికి వైఎస్సార్ చేయూత అందిస్తున్నామని ప్రకటించారు. వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ నిధులు విడుదల చేశామని తెలిపారు.
కుప్పం అంటే చంద్రబాబు పరిపాలన కాదని విమర్శలు చేశారు సీఎం జగన్. కుప్పం అంటే అక్కాచెల్లెళ్ల అభివృద్ధి అని… కుప్పం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి అన్నారు. ప్రతి మహిళకు ఏటా రూ.18,750 ఇస్తున్నామని… మహిళల జీవితాల్లో మార్పు కనిపిస్తోంది.
జనవరి నుంచి పెన్షన్ పెంపు. జనవరి నుంచి రూ.2,500 ఉన్న పెన్షన్ రూ.2,750కు పెంపు చేస్తామన్నారు సీఎం జగన్. కుప్పం మున్సిపాలిటీలో డబుల్ రోడ్డు కూడా చేయలేకపోయాడని…ఎన్నిసార్లు సిఎం అయినా కుప్పం రోడ్లు కూడా వేయలేదని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు మాత్రం కుప్పంలో ఎయిర్‌పోర్టు వస్తుందని చెవులో పువ్వు పెడుతాడని ఎద్దేవా చేశారు సీఎం జగన్.