బిజెపి తో, కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకునేది వీళ్లే…విడిపోయే ది వెళ్లే..పెళ్ళిళ్ళు చేసుకునేది వెళ్లే విడాకులు ఇచ్చేది వీళ్లేనంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై ఫైర్ అయ్యారు సీఎం జగన్. చంద్రబాబు ఏం చెపితే దానికి తల ఆడించడం ఒక్కటే దత్త పుత్రుడి తెలిసిందంటూ చురకలు అంటించారు. చంద్రబాబుతో సహా టీడీపీ వెంటిలేటర్ మీద ఉంది.. దత్త పుత్రుడు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా ప్రజలు నమ్మలేదని ఎద్దేవా చేశారు.
దండం పెట్టి పంపారు.. ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు పెట్టి పార్టీని అమ్ముతున్న ప్యాకేజ్ స్టార్‌కు సీఎం పదవి అవసరం లేదంట అంటూ ఎద్దేవా చేశారు సీఎం జగన్. ఏపీలో దోచుకుని..తెలంగాణలో బతుకుతున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. గత పాలనలో ఎస్సీలకు, బీసీలకు అన్యాయం జరిగిందని ఆగ్రహించారు. నేను చేసిన మంచిని, ప్రజలని, దేవుడిని నమ్ముకున్నా.. చంద్రబాబు, దత్త పుత్రుడు పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు నమ్ముకున్నారని వివరించారు సీఎం జగన్.