నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..ఆ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..

డిగ్రీలు, పిజిలు చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్..ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.5,160 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం జగన్ తాజాగా పశుసంవర్ధక శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రతీ ఆర్బీకేలో పశు సంవర్ధక శాఖ సహాయకులను నియమించాలని ఆదేశించారు. తద్వారా ఖాళీగా ఉన్న 5,160 ఖాళీలను భర్తీ చేయాలన్నారు. దాదాపు 1200 మంది వెటర్నరీ డాక్టర్లుగా పట్టాలు పొంది ఉన్నారన్నారు.

ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామంలో ఓ పశు వైద్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని పై అధికారులకు సూచించారు.ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మొత్తం 269 ఖాళీలను భర్తీ చేయనన్నట్లు నోటిఫికేషన్ల లో పేర్కొంది ఏపీపీఎస్సీ. ఇందులో గ్రూప్-4 కింద 6 పోస్టులు, నాన్ గెజిటెడ్ విభాగంలో 45, ఆయుర్వేద లెక్చర్ల విభాగంలో 3, హోమియో లెక్చరర్ల విభాగంలో 34, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ విభాగంలో మరో 72, హోమియో మెడికల్ ఆఫీసర్ విభాగంలో 53, యునాని మెడికల్ ఆఫీసర్ విభాగంలో 26, ఏఈఈ విభాగంలో 23 ఖాళీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇది ఇలా ఉండగా.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో మరో 7 ఖాళీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఇందుకు సంబందించిన పూర్తీ వివరాలను నోటిఫికేషన్లలో చూడవచ్చు.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా నోటిఫికేషన్లను అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్లో చూడొచ్చు. దరఖాస్తులు సైతం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఏపీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు..